అసోం ముఖ్యమంత్రికి ఏపీ సీఎం జగన్ ఫోన్

  • చేపల ఎగుమతులపై అసోం సీఎంతో మాట్లాడిన జగన్
  • అసోం సరిహద్దుల్లో లారీలు నిలిచిపోకుండా చూడాలని విజ్ఞప్తి
  • సానుకూలంగా స్పందించిన అసోం ముఖ్యమంత్రి
లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ అసోం ముఖ్యమంత్రి శరబానంద సోనోవాల్ కు ఫోన్ చేశారు. చేపల ఎగుమతులకు ఉన్న అడ్డంకులను తొలగించాలని అసోం సీఎంను కోరారు. అసోం వ్యాప్తంగా చేపల మార్కెట్లను తెరవాలని, అసోం సరిహద్దుల్లో లారీలు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జగన్ విజ్ఞప్తికి అసోం సీఎం శరబానంద సానుకూలంగా స్పందించారు. అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన, ఏపీలో నిలిచిపోయిన అసోం వాసులను ఆదుకోవాలని సీఎం జగన్ ను కోరగా, అన్ని రకాలుగా అండగా నిలుస్తామని సీఎం జగన్ బదులిచ్చారు.

Jagan
Sarabananda Sonowal
Lockdown
Fish Exports
Andhra Pradesh
Assam

More Telugu News